తెలంగాణలో బీఎల్ సంతోష్…కమలం ఆపరేషన్..!

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్రానికి చెందిన బడా నేత బీఎల్ సంస్తో పేరు కూడా వచ్చిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన సంతోష్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్ కూడా ఉన్నారని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ విచారణకు హాజరు కాలేదు..ఈలోపు కేసుని సీబీఐకి ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసు నడుస్తుండగానే తెలంగాణలోకి సంతోష్ ఎంట్రీ ఇచ్చారు..రాష్ట్రంలో పార్టీకి మరింత ఊపు తెచ్చేలా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా బీజేపీ పార్లమెంట్ విస్తారక్‌ల సమావేశంలో బీఎల్ సంతోష్ పాల్గొననున్నారు. అలాగే వర్చువల్ గా విస్తారక్‌ల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. తాజాగా ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గనికి ఒక పాలక్, ఒక విస్తారక్‌ను బీజేపీ నియమించనుంది. పాలక్, విస్తారక్‌లతో సంతోష్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం‌పై దిశానిర్దేశం చేయనున్నారు.

బీజేపీలోకి చేరికల ప్రళయం .. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదే క్రమంలో పార్టీలో చేరికలను వేగవంతం చేయాలని ఇప్పటికే కమలం పార్టీ నిర్ణయించింది. త్వరలో బీజేపీలోకి చేరికల ప్రళయం రాబోతుందని తాజాగా ఈటల రాజేందర్ అన్నారు. దీంతో ఏ పార్టీల నుండి కీలక నాయకులను ఆకర్షించే పనిలో ఉన్నారనే అంశంపై అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో పార్టీలలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికలలో అభ్యర్థులను ఇప్పటి నుండే సెట్ చేసే పనిలో ఉంది. దీనికోసం బలమైన నాయకులకు పార్టీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అందులో సీనియర్లని లాగాలని బీజేపీ చూస్తుంది. అయితే ఇక నుంచి చేరికలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి బీజేపీలోకి ఎవరు వస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news