సూర్య: పవన్ కల్యాణ్ ఒక రేర్ పీస్.!

-

పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇక తాను చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా అతని క్రేజ్ జనాల్లో మామూలుగా ఉండదు. ఇప్పటి కంటే 20 సంవత్సారాలు క్రితం యూత్ లో తన ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. ఇక తన ఎవర్గ్రీన్ హిట్ ఖుషి సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది.

అందుకే మళ్లీ ఈ సినిమా  రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఈరోజు (డిసెంబర్ 31న) ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.అయితే ఈ  సందర్భంగా  డైరెక్టర్ ఎస్ జె సూర్య అప్పటి ఆసక్తికరమైన విషయాలు గురించి చెప్పుకొచ్చారు.

ఈ సినిమా నిర్మాత రత్నం గారు ఈ సినిమా ఫిక్స్ చేసి నన్ను కథ చెప్పమని చెప్పాడు.ఇక తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ కు ఖుషి స్టోరీ చెప్పేందుకు వెళ్లినప్పుడు.. పవన్ ఒక టేబుల్ మీద కారు బొమ్మ పెట్టి.. చిన్నపిల్లాడిలాగా దానితో ఆడుకుంటున్నారని.. అది చూసి తాను ఆశ్చర్యపోయాను అని అన్నారు. ఆయన ఇంత సింపుల్ గా ఉండటం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక ఆయన తో చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది అది నాకు చాల సంతోషం గా అనిపించింది. ఇక ఇప్పటికీ మళ్లీ పవన్ తో ఆ రేంజులో ఇంకో చేయలేదనే బాధ తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news