కందుకూరులో పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు : చంద్రబాబు

-

ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో అపశృతి చోటు చేసుకొని 8 మంతి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కందుకూరు బహిరంగ సభకి వేలాది మంది ప్రజలు వచ్చారు.. మాజీ సీఎంగా నేను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదని ఆయన అన్నారు. పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. కర్నూలులో నాపై దాడికి వచ్చారని, కందుకూరు సభ పెట్టిన ప్రాంతంలో గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్, సినీ నటులు బహిరంగ సభలు పెట్టారన్నారు.

ప్రమాదానికి ముందే పోలీసులను హెచ్చరించినా పట్టించుకోలేదని, మృతులకు 25 లక్షలు పరిహారం ప్రకటించామన్నారు. ప్రధాని మోడీ స్పందించిన తరువాత జగన్ స్పందించాడని, 8 మంది టీడీపీ కార్యకర్తల్ని కోల్పోయి బాధలో ఉంటే పుండుమీద కారం చల్లినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ కోసం పని చేసే వారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటాను. హుదూద్ తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేశాం. 10 రోజులు విశాఖ లోనే ఉండి బాధ్యతగా పని చేశా. రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత టీడీపీదే అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news