ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఈ ఏడాది కూడా ప్రారంభానికి
సిద్ధమైంది. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ నుమాయిష్ ప్రారంభకానున్నట్లు.. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా నుమాయిష్‌లో వ్యాపారాలు సరిగా సాగలేవు అయితే ఈసారి ఎలాంటి అవంతరాలు లేకుండా నుమాయిష్ జరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నుమాయిష్ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ భద్రతా ఏర్పాట్లను నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక ఎంట్రీ ఫీజు విషయానికొస్తే పెద్దలకు రూ. 40గా నిర్ణయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఎంట్రీ ఫీజును మినహాయించారు.
నుమాయిష్‌ను హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ప్రారంభించనున్నారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేకగా అమ్యూజ్‌మెంట్ పార్కును సిద్ధం చేశారు. ఈ ఏడాది నుమాయిష్‌కు జనాలు భారీగా వచ్చే అవకాశం ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది.