2023 జనవరి నుండి మార్చి దాకా ఏయే స్కీములపై ఎంత వడ్డీ వస్తుందంటే..?

-

కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన మనకి ఎన్నో లాభాలు కలుగుతాయి. కేంద్రం అందిస్తున్న వివిధ రకాల డిపాజిట్లపై చక్కటి వడ్డీ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ పై వడ్డీని కూడా పెంచింది. కానీ సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మార్పులు లేవు. అదే పోస్టాఫీసు ఎఫ్‌డిపై 6.5 శాతం నుండి 7 శాతం వరకు వస్తుంది. ఇక ఎంత వడ్డీ వస్తుందనేది చూద్దాం.

ఇక వడ్డీ వివరాలని చూస్తే… ఏడాది కాల డిపాజిట్‌ పై వడ్డీ 6.5 శాతం వస్తుంది. రెండేళ్లు
కాల డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.8 శాతం వస్తోంది. అదే మూడేళ్ల కాల డిపాజిట్‌ పై వడ్డీ 6.9 శాతం వస్తుంది. ఐదేళ్ల కి 7% వడ్డీ వస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై అయితే వడ్డీ 7 శాతంగా వుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీద అయితే 7.1 శాతం ఇస్తున్నారు.

అలానే కిసాన్ వికాస్ పత్ర యోజనపై వడ్డీ 7.2 శాతం వస్తోంది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ 7.6 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీ 8 శాతంగా వుంది. అదే నెలవారీ ఆదాయ పథకంపై వడ్డీ 7.1 శాతం ఇస్తున్నారు. అలానే బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు ని కూడా పెంచారు. రిజర్వ్ బ్యాంక్ 2022 సంవత్సరంలో రెపో రేటును పెంచింది. అప్పటి నుండి కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news