#NTR 30 సినిమా కోసం జాన్వీ పారితోషకం ఎంతంటే..?

-

ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రం ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక నిన్నటికి నిన్న ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ సినిమాను ఫిబ్రవరి నెల నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని అలాగే వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో సినిమా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ఎన్టీఆర్కు సంబంధించిన ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా ఫైనల్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కెరియర్ తొలినాళ్ళలో క్లాస్ రోల్స్ లో కనిపించిన జాన్వీ కపూర్ ను కొరటాల శివ మాత్రం ఒకింత మాస్ రోల్ లో చూపించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ కి మాస్ ప్రేక్షకులలో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలు మాస్ రోల్ లో కనిపించడం జాన్వి కపూర్ కు ప్లస్ అవుతుందని కూడా చెబుతున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈమె ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోని ఈమె ఈ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇపోతే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ 4కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ సినిమా కావడంతో రెగ్యులర్ గా తీసుకునే పారితోషకం కంటే ఈమె తక్కువగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ నటించడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగనుంది. 300 కోట్ల రూపాయల బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు రాజీపడడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news