షాక్: బిగ్ బాస్ 6 ఫైనల్ కు మరీ ఇంత దారుణమైన రేటింగా.!

-

బిగ్ బాస్ గేమ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కొట్టుకుంటే నే చూసే మనం ఇక సెలబ్రిటీలు కొట్టుకుంటూ ఉంటే ఉండగలమా. అదే బిగ్ బాస్ షో కు రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం. ఇక గత సీజన్స్ తో పోల్చితే  ఈ సీజన్ మరీ దారుణంగా ఉందని నెటిజన్స్ దొమ్మెత్తి పోశారు.ఇక రేటింగ్స్  గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఇక బిగ్ బాస్ షో సీజన్స్ లో మొదటి మాత్రం సూపర్ హిట్ అయ్యింది, ఈ సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండటం, బిగ్ బాస్ కొత్త కాబట్టి నిజమయిన సినిమా, టీవి సెలబ్రిటీలు కంటెస్టెంట్లు గా రావటం తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.అలాగే నాలుగు సీజన్స్ వరకు బిగ్ బాస్ షో బాగానే అలరించింది.ఇక ఆరో సీజన్ అయితే దారుణంగా ఉందని కామెంట్స్ వచ్చాయి.

ఇక 6 సీజన్ బిగ్ బాస్ షో ఫైనల్ ఎపిసోడ్ టిఆర్‌పి రేటింగ్స్ విడుదల అయ్యాయి.అవి చూసి నిర్వాహకుల కళ్ళు బైర్లు కమ్మాయి. అంతకు ముందు వరకు కనీసం డబల్ డిజిట్ వచ్చిన రేటింగ్ ఇప్పుడు ఏకంగా సింగిల్ డిజిట్ కు పడిపోయింది. దీనికి కారణం ఎపిసోడ్స్ అన్ని స్క్రిప్ట్ రాసుకొని చేస్తున్నట్లు గా ఉండడం, అలాగే జనాలకు ఎక్కువుగా తెలియని ముఖాలను తీసుకోవడం తో షో బోల్తా కొట్టింది. అందుకే ముందుగా నాగార్జున మూట ముల్లె సర్దుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news