మీ అకౌంట్లకి ఇలాంటి పాస్వర్డ్లు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త సుమా..!

-

మనం బ్యాంకు అకౌంట్‌స్ కి లేదంటే సోషల్‌ మీడియా అకౌంట్లకు పాస్వర్డ్స్ ని పెట్టుకుంటూ ఉంటాము. పాస్వర్డ్ అనేది ఎంతో ముఖ్యం. పాస్వర్డ్ వలన ఏ రిస్క్ లేకుండా అకౌంట్ భద్రంగా ఉంటుంది. అయితే చాలా మంది పాస్‌వర్డ్‌లు పెట్టుకునే ముందు కొన్ని తప్పులని చేస్తూ వుంటారు.

ఎప్పుడైనా సరే ఏ పాస్వర్డ్ ని పెట్టుకోవడానికి అయినా సరే స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాల్సి వుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈజీ పాస్వర్డ్స్ ని పెట్టుకుంటే హ్యాకర్లు హ్యాక్‌ చేసే ప్రమాదం వుంది. మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు లో ఉన్న డబ్బంతా ఖాళీ అయ్యే ప్రమాదం వుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి.

పాస్‌వర్డ్‌లు పెట్టుకునే ముందు బలమైనది పెట్టుకోవడం మంచిది. ఎక్కువగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర అకౌంట్‌స్ ని హ్యాక్ చేస్తూ వుంటున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఇలాంటి పాస్వర్డ్స్ ని మాత్రం అస్సలు పెట్టద్దు. qwerty, password, 111111, abc123, 12345,1234567 వంటివి పెట్టకండి. అలానే 123456, password1 వంటివి కూడా పెట్టద్దు. ఇటువంటి వాటిని పెట్టడం వలన అకౌంట్లను హ్యాక్‌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని పెట్టుకోండి. లేదంటే మీ ఖాతాలో ఉండే మొత్తం కాజేసే ప్రమాదం వుంది.
ఎప్పుడు కూడా ఈజీ పాస్వర్డ్స్ ని పెట్టుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news