ఏపీ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా నీ నోటి కి మునిసిపాలిటీ చెత్తకుప్పకు తేడాలేదని ఫైర్ అయ్యారు నాగ బాబు.
బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో చూసుకో అంటు చురకలు అంటించారు మెగా బ్రదర్. మీ ప్రభుత్వము రాగానే పర్యాటక శాఖ అధ:పాతాళానికి పడిపోయిందని ఫైర్ అయ్యారు.
పర్యాటక శాఖ ఉద్యోగులు రోడ్డున పడ్డారని..మా అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ను..అన్నయ్య చిరంజీవి ను నీవు ఎన్ని సార్లు తిట్టినా భరించామని తెలిపారు. ఇక పై నీ నోటిని అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు నాగ బాబు.