ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటానని ప్రకటన చేశారు మేకతోటి సుచరిత. రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని వెల్లడించారు మేకతోటి సుచరిత.
నేను పార్టీ మారుతున్నట్టు చేస్తున్న ప్రచారాలు అవాస్తవం. నేను పార్టీ మారే ఆలోచనే లేదు. నాపై కొన్ని మీడియా చానళ్లు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఏమైనా సందేహాలుంటే నన్ను సంప్రదించాలి. అలా కాకుండా మీడియా చానళ్లు అవాస్తవాలను ప్రచారం చేస్తే ఎలా? అని నిలదీశారు. నాడు వైఎస్సార్ భిక్షతోనే రాజకీయాల్లోకొచ్చి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని నేనేనని స్పష్టం చేశారు మేకతోటి సుచరిత.