ఫ‌స్ట్ కోడెల‌… సెకండ్ య‌ర‌ప‌తినేని… టీడీపీలో థ‌ర్డ్ వికెట్ ఎవ‌రంటే..!

-

ఊహించని మెజారిటీతో తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలకి చుక్కలు చూపిస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తమని ఇబ్బందులకు గురిచేసిన నేతలనీ వైసీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వరుసగా వారి అక్రమాలని బయటకుతీస్తూ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే మొదట మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ని టార్గెట్ చేసింది.

అధికారం ఉన్న సమయంలో సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడిన కోడెల కుమారుడు, కుమార్తెలపై చాలా కేసులు వచ్చి పడ్డాయి. ఇక తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ కేసులో చిక్కుకున్నారు. స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీ ఫర్నిచర్ ని కుమారుడు షో రూముకు తరలించడంపై సీరియస్ అయిన ప్రభుత్వం కోడెలపై కేసు నమోదు చేసింది. ఈ కేసు తర్వాత గుండెనొప్పితో కోడెల హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక కోడెల తర్వాత అదే గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే యరపతినేనిపై అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణకు కోర్టు కూడా అనుమతించింది. అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు సీఐడీ కూడా నిర్ధారించింది. అటు యరపతినేని బ్యాంక్ లావాదేవీల్లో ఉన్న లొసగులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది.

యరపతినేని తర్వాత చంద్రబాబు కుటుంబానికి బినామిలా వ్యవహరిస్తున్నారంటూ ఎప్పటి నుంచో విమర్శలు ఎదురుకుంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ ప్రభుత్వానికి మూడో టార్గెట్ అని తెలుస్తోంది. త్వరలోనే రాజధాని భూములు, అగ్రిగోల్డ్ వ్యహారాల్లో జరిగిన అవకతవకలపై పుల్లారావు పేరు బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ పై కేసు నమోదైంది.

ప్రభుత్వ ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడి.. తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు సరుబుజ్జిలి ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. దీంతో రవితో పాటూ అనుచరులపైనా కేసులు పెట్టి ఆయనని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తాజాగా భూకబ్జా కేసు నమోదైంది. ఇక ఈ కేసులు నమోదైన వ్యక్తులు అందరూ అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీపై దూకుడు ప్రదర్శించిన నేతలే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news