చిలకడ దుంప సాగులో మెళుకువలు..

-

చిలకడ దుంప సాగు కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది..ముందుకు ఈ పంటకు అనువైన నేల,విత్తనం, ఎరువుల యాజమాన్యం, తెగుల్ల నివారణ మొదలగునవి తప్పక తెలుసుకోవాలి.ఒండ్రు, ఇసుక్క గరప నేలలు సాగుకు అనుకూలం. బంక మట్టి నేలల్లో దుంపలు సరిగా ఊరవు..రాత్రి సమయం ఎక్కువ ఉండే కాలంలో దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. నీడ ఎక్కువగా ఉంటే దుంపలు సరిగా ఊరవు. ఈ పంట ఎక్కువ వర్షాలు తట్టుకోలేదు..దుంపలు కుళ్ళి పోతాయి.

 

 

సామ్రాట్, కిరణ్, యస్ 30/21 శ్రీనందిని, శ్రీవర్దిని, వర్ష శ్రీరత్న శ్రీబద్ర రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పంట తీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక మోస్తరు లేతగా ఉన్న తీగలను నాటడానికి ఉపయోగించాలి. సుమారు 20 సెం.మీ పొడవు 2-4 కణుపులు 5-6 ఆకులు ఉన్న తీగలను నాటడానికి ఎంపిక చేసుకోవాలి.. – జూన్, జులై , రబీ – అక్టోబర్, నవంబర్ , వేసవి – ఫిబ్రవరి, మార్చి లో ఈ పంటను సాగు చేయవచ్చు..

కాగా, 20-80 సెం.మీ పొడవుతో 3-4 కణుపులు ఉన్న తీగలను నాటితే బాగా బతికి ఎక్కువగా దిగుబడినిస్తాయి. తీగలను నాటేటప్పుడు మధ్య భాగాన్ని భూమిలో పూడ్చి, రెండు చివరలు భూమిపై ఉండేటట్లు తీగల్ని నాటాలి. మరో పద్ధతిలో తీగల్ని నిలువుగా కాని, ఏటవాలుగా కాని 2-5, 7-5 సెం.మీ లోతులో నాటాలి.

ఇక ఎరువుల విషయానికొస్తే..ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 25 కి.భాస్వరం, 16 కె. పొటాష్ను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజని 2 దఫాలుగా అంటే నాటిన 80 మరియు 60 రోజులకు వేయాలి.ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 25 కి.భాస్వరం, 16 కె. పొటాష్ను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజని 2 దఫాలుగా అంటే నాటిన 80 నుంచి 60 రోజులకు వేయాలి. 16 కి. పొటాష్ను రెండవ దఫాగా నాటిన 60 రోజుల తర్వాత వేయాలి.

తీగలు నాటేటప్పుడు నీటిలో తేమ ఉండాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నీరు పెట్టాలి. నాటిన 80 రోజుల వరకు పంట నీటి ఎద్దడికి గురికారాదు. దుంప పెరుగుదల దశలో వారం రోజల వ్యవధిలో నీరు పెట్టాలి. తెగుల్ల సమస్యలు కూడా తక్కువగా వుంటాయి..సరైన పద్దతుల ద్వారా పండిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు..ఇంకేదైనా సమస్యలు వుంటే వ్యవసాయనిపునుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news