ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సిఎస్ సోమేశ్ కుమార్ భేటీ

-

తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు విలువరించిన విషయం తెలిసిందే. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది హైకోర్టు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణలో సీఎస్ గా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ 2017లో కోర్టును ఆశ్రయించింది కేంద్రం. చాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ బెంచ్ ఈ మేరకు నేడు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో సోమేశ్ కుమార్ సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై సీఎంతో చర్చించనున్నట్లు సమాచారం. తదుపరి కార్యాచరణ పై సీఎంతో భేటీ అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news