కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీలో ప్రస్తుత పరిస్థితులు.. బలాలు.. బలహీనతలు.. పార్టీని బలోపేతం చేయడంపై చర్చించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. నిన్న నియోజకవర్గ పర్యటనల వల్ల ఠాక్రేను కలవలేకపోయానని క్లారిటీ ఇచ్చారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో అడగండని అన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయం అల్పాహార విందులో ఠాక్రేతో కోమటిరెడ్డి సమావేశమయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నియోజకవర్గ పర్యటనలో ఉన్నందునే నేను మాణిక్ రావు ఠాక్రేను కలవలేకపోయాను. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు ఠాక్రేను ఎందుకు కలవలేదో ముందు అడగాలి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదుసార్లు ఓటమి పాలైన వాళ్లతో నేను కూర్చోవాలా?. మా ఫొటోలు మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోలేదు. నా ఫొటో మార్ఫింగ్ జరిగిందని సీపీగారే చెప్పారు.’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.