వాళ్ల సినిమా ప్లాప్ కావాలని కోరుకోను ! అంటూ చిరు వారిపై సెటైర్స్.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా రేపు థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నరు. ఈ సినిమా కోసం మైత్రీ వారు ఈ ప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో చేస్తూ అదరగొడుతున్నారు..ఇక వీరయ్య ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అనేక మీడియా సంస్థ లకు  మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ తన ఫ్యాన్స్ తన అతి మంచితనం గురించి ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు. తన స్థాయికి తగని వాళ్ళు కూడా దారుణ విమర్శలు చేసినా కూడా గట్టిగా బదులు ఇవ్వటం కొపగించు కుంటారు అని తెలిపాడు. కాని తనది ఒకరికి హాని తలపెట్టే మనస్తత్వం కాదని తెలిపాడు.

అలాగే ఈ రోజుల్లొ ‘ఒకరి సినిమా ఫ్లాప్ కావాలి, తన సినిమా హిట్ కావాలని చూసే వారిని చూస్తే కోపం రావడం లేదు, కాని భాద కలుగుతోంది.అలాంటి మనస్తత్వం మా రక్తంలోనే లేదు. నా కొడుకు రామ్‌చరణ్‌ మొదట వీరసింహారెడ్డి చూస్తాడేమో, అలా ఉంటుంది మా మైండ్ సెట్ ! కాని  అమెరికాలో ఈ రెండు సినిమాల విషయంలో జరుగుతుంది చూస్తే బాధేస్తోంది. మేము ఎవరిని టార్గెట్ చేయము అంటూ ఇన్ డైరక్ట్ గా బాలయ్య బాబు ఫ్యాన్స్ పై సెటైర్స్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news