పవన్ కళ్యాణ్ అసలు సిసలైన ప్యాకేజీ స్టారేనని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు అంబటి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ది పక్కా ప్యాకేజీ రాజకీయమని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘గౌరవమిస్తే కలిసి పోటీ చేస్తా’ అని పవన్ చెప్పిన మాటలకు అర్థం, గౌరవం అంటే ప్యాకేజీ అని స్పష్టం చేశారు. ప్రజలకు విశ్వాసం కలిగిస్తే ఓట్లు వేస్తారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా, ఎవరితో కలిసి పోటీ చేసినా, మరణం ఖాయమని చెప్పారు. మూడు, మూడు ముళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కు లేదని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకుని పవన్ రాజకీయం నడుపుతున్నాడనేది నూటికి నూరుపాళ్లు నిజం.. జగన్ లాంటి ఏనుగులు వెళ్తుంటే పవన్ లాంటి కుక్కలు మొరుగుతుంటాయని ఫైర్ అయ్యారు. ప్రజలను గ్యారెంటీ కార్డు అడిగే పవన్.. జగన్ గురించి మాట్లాడటమేంటి? అని నిలదీశారు మంత్రి అంబటి రాంబాబు.