వామ్మో.. సినిమాను తలపిస్తున్న దిల్ రాజు లవ్ స్టోరీ.!

-

తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆయన రెండవ భార్య తేజస్విని ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఎన్నో విషయాలను పంచుకున్నారు. అంతేకాదు తమ వివాహానికి సంబంధించి తొలిసారి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.. దిల్ రాజు తన రెండవ భార్య తేజస్విని ఎలా కలిశారు అన్న విషయాలపై స్పందించిన దిల్ రాజు.. తన లవ్ స్టోరీ ని కూడా వెల్లడించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “నా మొదటి భార్య అనిత మరణించిన తర్వాత రెండు సంవత్సరాల పాటు ఎంతో కష్టాన్ని అనుభవించాను. అప్పటికే నా వయసు 47 ఏళ్లు.

జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలి అనుకుంటున్న సమయంలో రెండు మూడు ఆప్షన్స్ వచ్చాయి. కానీ నా బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి రావాలని అనుకున్నాను. అదే సమయంలో నేను ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తేజస్విని నాకు పరిచయమయ్యింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకోవడానికి ఫోన్లో మాట్లాడుతూ ప్రయత్నించాను. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేయడం.. ఫ్యామిలీతో చర్చలు.. చివరికి వివాహం వరకు వెళ్ళింది” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఎంత ఎదిగి ఉన్నా కూడా తేజస్విని తన అధికారాన్ని చూపించదు. అందుకే అమ్మాయి అంటే నాకు ఇష్టం అని దిల్ రాజు తెలిపారు. అలాగే తేజస్విని కూడా దిల్ రాజు తనకు ఎలా పరిచయమయ్యారని విషయాన్ని వెల్లడిస్తూ..” నేను ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్గా ఈయన ట్రావెల్ చేసేవారు. మొదటిసారి నన్ను కలిసినప్పుడు ఫోన్ అడిగారు. నేను షిఫ్ట్ లో ఉన్న ప్రతిసారి విమానంలో కనిపించేవారు. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news