ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు కేరళ, దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. రాత్రి వారు ఇక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం వారు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి అల్పాహారవిందు చేస్తారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్తారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని హెలికాప్టర్లలో ఖమ్మం వెళ్తారు. అక్కడ కంటివెలుగు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే భారాస ఆవిర్భావ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం వారు విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు.
తెలంగాణ సీఎంతో పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్న సందర్భంగా 18న బుధవారం యాదాద్రి ఆలయంలో ఆర్జిత నిత్యకల్యాణం రద్దు పరిచినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. అదేరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహించే బ్రేక్ దర్శనాలను కూడా నిలిపివేశారు. భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఈవో పేర్కొన్నారు.