ఆరోగ్యానికి బార్లీ చాలా మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణులు కూడా బార్లీ ని తీసుకోవడం వలన వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని అంటున్నారు. బార్లీ వలన ఎటువంటి ఇబ్బందులు దూరమవుతాయి..? ఏ లాభాలను మనం పొందొచ్చు అనే ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీలో పోషక పదార్దాలు సమృద్ధిగా ఉంటాయి. సెలీనియం, కాపర్, క్రోమియం, విటమిన్ బి వన్, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం మొదలైనవి ఇందులో ఉంటాయి కాబట్టి బార్లీ ని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిదే.
బార్లీతో ఈ సమస్యల దూరం:
జీర్ణ సమస్యలు:
బార్లీ లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యల్ని తొలగిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గొచ్చు:
బార్లీ ని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి కూడా అవుతుంది అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు బార్లీ ని తీసుకోవడం మంచిది.
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవు:
బార్లీ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిని తీసుకోవడం వలన పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవు.
చెడు మలినాలని బయటకి పంపిస్తుంది:
బార్లీ శరీరంలో ఉండే చెడు మలినాలని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది:
బార్లీ ని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది.
డయాబెటిస్ వారికి మంచిది:
టైప్ టు డయాబెటిస్ ప్రమాదం ని ఇది తగ్గిస్తుంది చక్కెర స్థాయిలని కూడా తగ్గిస్తుంది అలానే బార్లీ ని తీసుకోవడం వలన మనం రోగ నిరోధక శక్తి ని కూడా పెంచుకోవడానికి అవుతుంది.