ఘోర పడవ ప్రమాదం.. 145 మంది మృతి

-

రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మరణించారు. నదిలో 200 మంది ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 145 మంది మరణించగా 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాంగో వెళ్తుండగా బసన్ కును పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news