పిలిచినా బీఆర్ఎస్ సభకు వెళ్లకపోయేవాణ్ని : నీతీశ్‌ కుమార్‌

-

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు జాతీయ నేతలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేరళ, పంజాబ్, దిల్లీ ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే తాజాగా ఈ సభపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయేతర పక్షాలతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదన్న నీతీశ్‌ కుమార్‌.. ఆహ్వానం అందినా ‘సావధాన్‌ యాత్ర’, రాష్ట్ర (బిహార్‌) బడ్జెట్‌కు సంబంధించిన సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ఆ సభకు హాజరుకాలేక పోయేవాణ్ని అని పేర్కొన్నారు.

బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపై రావాలని కోరుకుంటున్న నీతీశ్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘స్వప్రయోజనాలకోసం ఏమీ కోరుకోవడం లేదు. జాతి ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగితే చూడాలని ఉంది. తెలంగాణలో జరిగింది బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమే. కొత్తకూటమి ఏర్పాటుకోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదు. ఆహ్వానం అందుకున్న వారు ఆ సమావేశానికి హాజరయ్యారు’’ అని నీతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news