రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని జనాలు చెబుతుంటారు. కానీ అవి ఒకదానితో మరోటి తెలియకుండానే మిక్స్ అయిపోతుంటాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండిటికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రావడం.. ఇటు ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం సినిమా వ్యక్తలే కావడంతో ఇండస్ట్రీకి, పాలిటిక్స్‌కు ఇక్కడ బాగా లింక్ కుదిరింది.
ఇక ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన కొంతమందికి ఇప్పుడు అవకాశాలు తగ్గాయన్న ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా ఇది వాస్తవం. ఇండస్ట్రీలో కమెడియన్లుగా ఉన్న అలీ, ఫృథ్వీ, పోసానీలపై ఈ ఎఫెక్ట్ చాలా పడింది. తెలుగు సినిమాలో పార్టీల పరంగా, కులల పరంగా చీలిక స్పష్టంగా కనిపిస్తుంటుంది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రెండు, మూడు కులాలు, వర్గాలు, కొన్ని ఫ్యామిలీలదే ఆధిపత్యం ఉంది.
వాళ్లకు ఎదురెళితే ఇబ్బందులు తప్పవు. గతంలో ఈ పాలిటిక్స్ అంతగా ఇండస్ట్రీలో ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇవి బాగా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అలీ, ఫృథ్వీ, పోసానిల విషయంలో అదే జరుగుతోంది. పవన్‌కు ఎంతో సన్నిహితుడు అయిన ఆలీ గత ఎన్నికలకు ముందు ఏ పార్టీలో చేరాలో తెలియక గంరదగోళంలో పడి చివరకు వైసీపీలో జాయిన్ అయ్యాడు. పవన్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు. వైసీపీ గెలవడంతో ఏదో ఒక పదవి వస్తుందని ఆలీ ఆశించాడు.
ఆలీ కురుకున్నది జరగలేదు… ఇటు ఆయనకు అవకాశాలు కూడా రావడం లేదు. ఆలీ అంటే ఎవరికి వైరం లేకపోయినా పవన్, మెగా కాంపౌండ్‌కు యాంటీ అవ్వడంతో వాళ్లు ఛాన్సులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక వైసీపీకి వన్‌సైడ్‌గా సపోర్ట్ చేసిన పృథ్వికి జగన్ ఎస్వీబీసీ చైర్మన్ ఇచ్చారు. ఆయనకు కూడా ఇప్పుడు సినిమా ఛాన్సులు తగ్గాయి. అయితే పృథ్వి ఆశించిన పదవి రాకపోయినా ఏదో ఒక పదవి అయితే జగన్ ఇచ్చారు. పృథ్వి ఏకంగా ఎమ్మెల్సీ ఆశించారట.
ఇక ఫైర్‌బ్రాండ్ కమెడియన్ పోసాని కూడా వైసీపీకి బలంగా సపోర్ట్ చేశాడు. పోసాని పదవి ఆశించలేదని చెప్పినా ఆయనకు కూడా సినిమా అవకాశాలు తగ్గాయ్. తాను వైసీపీకి సపోర్ట్ చేయడంతో కొందరు నిర్మాతలు తమ సినిమాల్లో పెట్టుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు. పోసాని అటు పవన్, ఇటు టీడీపీకి బాగా దూరమయ్యాడు. దీంతో ఇండస్ట్రీలో ఎక్కువుగా ఉండే టీడీపీ సానుభూతిపరులు ఆయన్ను దగ్గరకు రానివ్వడం లేదు. మెగా కాంపౌండ్‌కు దగ్గరగా ఉండే ఆలీ కూడా ఇప్పుడు ఇటు టీడీపీ వాళ్లతో పాటు అటు మెగా కాంపౌండ్‌కు దూరమవ్వడంతో వాళ్లు ఛాన్సులు ఇవ్వడం లేదు. ఇక యంగ్ కమెడియన్ల హవా ముందు కూడా వీళ్లు ఆగలేకపోవడం మరో మైనస్.