హైదరాబాద్ వాసులను వాతావరణ కేంద్రం హెచ్చరింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా ఈనెల 26 నుంచి నగరంలో విపరీతమైన పొగమంచు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈనెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌కు ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది. జనవరి 26 నుంచి నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది.
నగరవాసులు ఈనెల 26 నుంచి జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచు ఎక్కువగా కురవనున్నందున శీతాకాలంలో ధరించే ఉన్నిదుస్తులు ధరించాలని చెప్పారు.