మొబైల్ లో చాట్ బాట్ సేవలను వాట్సాప్ తో ఎలా లింక్ చేసుకోవాలంటే?

-

చాట్ జీపీటీ గతకొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మద్దతు ఉన్న చాట్ బాట్ అనేక పరిశ్రమలకు, ఇతర రంగాలకు గో టు టూల్ గా మారింది..ఈ టూల్ ను మీ ఫోన్ లో పని చేసేలా చేయాలనుకుంటున్నారా? మన మొబైల్ లోని వాట్సాప్ తో దీన్ని అనుసంధానించు కోవచ్చు అని మీకు తెలుసా.. వాట్సాప్ ఖాతాతో చాట్ బాట్ ను అనుసంధానించుకుంటే మరింత వేగంగా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే వాట్సాప్ కు చాట్ బాట్ అనుసంధానించడానికి అఫిషియల్ యాక్సెస్ లేదు.. కానీ కొన్ని టెక్నీక్స్ ద్వారా ఆ సేవలను పొందవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..

చాట్ బాట్ సేవలు వచ్చేలా చేయవచ్చు. ఇలా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాట్సాప్ బాట్ ను తయారు చేసి దాన్ని చాట్ జీపీటీకి లింక్ చేయడం ఒక మార్గం. పైథాన్ స్క్రిప్ట్ ను ఉపయోగించి మీ వాట్సాప్ నెంబర్ సెట్ చేసి, ఒకేసారి చాట్ జీపీటీని ప్రారంభించడం రెండో పద్ధతి.. ఈ పద్ధతుల ద్వారా ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ముందుగా వాట్సాప్ బిజినెస్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం చాట్ కోసం ఫ్లోను సృష్టించాలి. ఆపై చాట్ డెవలపర్‌ని ఉపయోగిస్తూ చాట్‌బాట్‌ను అనుసరించాలి. తర్వాత మీ ఫోన్‌లో ఏపీఐ చాట్‌బాట్‌ను ఉంచాలి. తదుపరి దశలో మీరు ఓపెన్ ఏఐ ఏపీఐ ద్వారా ఫైల్ ఓపెన్ చేయాలి.. ఆ తర్వాత ఒక సీక్రెట్ కీని క్రియేట్ చెయ్యాలి.అయితే వాట్సాప్ ఇంటిగ్రేషన్ అసలైనదని గుర్తించకపోతే, మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయని గమనించాలి.. అందుకే జాగ్రత్తగా ఉండాలి..

చివరగా..జీపీటిని ఇంటిగ్రేట్ చేయడానికి, టెర్మినల్‌లోని GitHub> Execute server.py నుంచి కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ జిప్ ను క్లిక్ చేయాలి.ఇక టెర్మినల్‌లో వాట్సాప్ -జీపీటీ-ప్రిన్సిపల్ ఫైల్‌ను అనుమతించాలి.ఇప్పుడు ఐఎస్ తో ఎంటర్ అవ్వాలి. తర్వాత పైథాన్. సర్వర్ . పీవై ను నమోదు చేయండి. అనంతరం మీ ఫోన్ దానంతట అదే ఓపెన్ పేజీని కాన్ఫిగర్ చేస్తుంది. అనంతరం సెక్యూరిటీ చెక్ చేస్తుంది. దీంతో వాట్సాప్ చాట్ జీపీటీ రిజిస్టర్ అవుతుంది..వాట్సాప్ ఖాతను ఓపెన్ చేసి, అందులో మై ఎకౌంట్ పేజికి వెళ్తే, అక్కడ ఓపెన్ ఏఐ జీపీటి ఇంటిగ్రేటెడ్‌ అని ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేస్తే మన ఫోన్లో చాట్ బాట్ సేవలను పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news