జుట్టుకు సంబంధించి చాలామంది ఎన్నోరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు ఇలా చాలానే ఉన్నాయి.. వీటికి పరిష్కారాలు కూడా మీరు ఎన్నో చూసి చేసి ఉంటారు. జుట్టు ఆరోగ్యానికి తినే తిండి ఎంత ముఖ్యమైనది.. మీరు వాడే దువ్వెన కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా..? ఎవరి దువ్వెన వారే వాడాలి. ఇంట్లో నలుగురు ఉంటే.. నలుగురికి కలిపి ఒకటే దువ్వెన పెట్టుకుంటారు.. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు వస్తాయి.. అలాగే వాడే దువ్వెన వల్ల కూడా జుట్టు ఆరోగ్యం బాగవతుంది. నమ్మడం లేదా..? అయితే ఈ ఆర్టికల్ మొత్తం చదివేయండి.!!
వేప చెక్కతో తయారు చేసిన దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుందని చాలామంది అంటుంటారు.. ఇది ఎంత వరకూ నిజం అనే విషయానికి వస్తే.. వేప దువ్వెనలో అనేక గుణాలున్నాయి. ఈ దువ్వెన అనేక రకాల సమస్యలను దూరం చేస్తుంది. వేప కర్రలో కొన్ని పదార్థాలు ఉంటాయి, ఇది ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. కాబట్టి వేప దువ్వెన ఉపయోగించడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఉండదు. జుట్టు మూలాలు బలంగా ఉంటాయి.
వేపలోని కొన్ని పదార్థాలు జుట్టును మృదువుగా చేస్తాయి.. పొడి జుట్టు సమస్య ఉన్నవారు ఈ రకమైన దువ్వెనను ఉపయోగించడం ద్వారా ఆ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. వేప దువ్వెన జుట్టు పోషణలో కూడా సహాయపడుతుంది. ఈ దువ్వెనను ఉపయోగిస్తున్నప్పుడు చెక్కలోని కొన్ని పదార్థాలు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలు రూట్ ఇన్ఫెక్షన్, డ్రై హెయిర్ లేదా హెయిర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కూడా జరగొచ్చు.. వేప చెక్క దువ్వెనతో ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కానీ జుట్టు రాలడం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. జన్యుపరమైన కారకాలు వంటివి ఉంటాయి. ఈ దువ్వెన ఆ సమస్యలను పరిష్కరించలేదని చెప్తున్నారు.
గుడ్డికంటే మెల్ల మేలు అన్నట్లు.. మూమూలు దువ్వెనలు వాడేకంటే.. ఈ దువ్వెన వాడటం వల్ల మీ జుట్టు సమస్యలను చాలా వరకూ తగ్గించుకోవచ్చు.. జుట్టును డైలీ దువ్వుకుంటేనే స్కాల్ప్‌లో రక్తప్రసరణ జరిగి జుట్టు పెరుగుతుంది. రాలడం తగ్గుతుంది. చెక్క దువ్వెనలు వాడటం వల్లజుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా వేప చెక్క దువ్వెన అయితే మరీ మంచిదీ..!