Union budget 2023: దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు

-

పార్లమెంటు సమావేశాలలో బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై నిర్మల సీతారామన్ ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మత్స్య శాఖకు 6000 కోట్ల నిధులు కేటాయించారు. రీజినల్ హెయిర్ కనెక్టివిటీ ద్వారా ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తామన్నారు. నగరాలు, రాష్ట్రాలలో భూములను అందుబాటులోకి తెస్తామన్నారు. అర్బన్ ఇన్ఫ్రాక్చర్ ఫండ్ ద్వారా నిధులు ఇస్తామన్నారు.

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగిస్తామని తెలిపారు. అలాగే వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు నిర్మల సీతారామన్. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు చేపడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని నగరాలు, పట్టణాలలో మాన్ హోల్, మిషన్ హోల్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరుస్తామన్నారు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం కు 2000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news