ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశ పెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మంత్రి ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదేనని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆర్థిక బలాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రపంచమంతటా మందగమనం ఉన్నప్పటికీ మన దేశంలో వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉందని మంత్రి నిర్మల చెప్పారు. కరోనా కష్టాల నుంచి వేగంగా తేరుకుంటున్నామని, ఈ ఏడాదితో వాటన్నింటినీ గట్టెక్కుతామని తెలిపారు.