ఇప్పటి వరకు ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కనెక్ట్ చేసింది. దూరాలు, దేశాలతో సంబంధం లేకుండా ఫేస్‌బుక్ ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేసింది. ఈ సోషల్ మీడియా దిగ్గజం ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇక నుంచి సీక్రెట్‌గా ఫేస్‌బుక్‌లో డేటింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికి సీక్రెట్ క్రష్ అంటే రహస్య ప్రేమ అని పేరు పెట్టింది ఫేస్‌బుక్.
ఇప్పటికే ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు అనేక ఫీచర్లతో మనిషి లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది. ఈ క్రమంలోనే మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ కొత్త ఫీచర్ మాత్రం కేవలం అమెరికా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీక్రెట్ క్రష్ యాప్‌లో జాయిన్ అయిన వారు ఎవరైనా తమ ఇష్టాఇష్టాలు షేర్ చేసుకోవచ్చు.
అలాగే తమ ఫ్రెండ్స్‌ను కూడా ఇందులో పరిచయం చేయవచ్చు. ఈ తరహా డేటింగ్‌కు ఫేస్‌బుక్ కంటే ముందే టిండర్ వెబ్‌సైట్ ఉంది. దానికి పోటీగా ఇప్పుడు ఫేస్‌బుక్ ఈ సీక్రెట్ క్రష్ ఫీచర్ తీసుకువచ్చింది. ఈ క్రష్‌తో కనెక్ట్ కావాలంటే నచ్చిన వారి ప్రొఫైల్‌ను, ఫొటోపై కామెంట్ చేస్తేచాలు. ఈ ఫీచర్‌లో ఒకరి మిత్రులను మరొకరికి మిత్రులుగా చేయవచ్చు.
ఎవరైనా నచ్చకపోతే ఇంటూ మార్క్‌ను క్లిక్ చేస్తే చాలు. అంతేగాకుండా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నిక్షిప్తం చేసిన సమాచారం, ఫొటోలను నేరుగా ఈ ‘సీక్రెట్ క్రష్’పైకి తీసుకొచ్చి మిత్రులతో షేర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందులో ఉంది. ఇక డేటింగ్ చేసే వారి వివరాలు ఇందులో చాలా సీక్రెట్‌గా దాచుకోవచ్చు. మరి ఈ సరికొత్త ఫీచర్ మిగిలిన దేశాలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ? ప‌్రజల జీవితాల్లో ఇంకెన్ని సరికొత్త మార్పులు తీసుకువస్తుందో ? చూడాలి.