గుజరాత్లో మోర్బీ బ్రిడ్జి కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్ ఎండీ జైసుఖ్ పటేల్‌ను పోలీసులు వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. మోర్బీ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేయడంతో న్యాయస్థానం ముందు లొంగిపోయారు. గతేడాది అక్టోబర్ 30న మోర్బీ వంతెన కూలిపోయిన ప్రమాదంలో 135 మంది మరణించారు. అప్పటినుంచి ప్రధాన నిందితుడైన జైసుఖ్ పటేల్ పరారీలో ఉన్నారు.
ఈ కేసులో గుజరాత్ పోలీసులు 1262 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. జనవరి 24న గుజరాత్ కోర్టు పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్‌లో సంఘటన జరిగినప్పటి నుంచి జైసుఖ్ పటేల్ కనిపించకుండా పోయారని, ఛార్జిషీట్లో ‘పరారీ’గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ఈ నెల 20 న మోర్బీ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే నెల 1 వ తేదీకి వాయిదా పడింది.