రక్షణ రంగంలో భారత్ బలోపేతం.. 75 దేశాలకు రక్షణ పరికరాలు

-

రక్షణ రంగంలో భారత్ బలోపేతంగా తయారైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విదేశాలకు రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్​ మారిందని వెల్లడించారు. కర్ణాటకలోని బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా-2023 ప్రదర్శనను మోదీ.. ఇవాళ ప్రారంభించారు. అనంతరం భారత వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.

“ఏరో ఇండియా ప్రదర్శన.. భారత్​ కొత్త బలం, సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. కేంద్ర బడ్జెట్​లో రక్షణ రంగ వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్ద పీట వేశాం. పరిశ్రమలకు ఇచ్చే అనుమలు సరళతరం చేశాం. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలు తయారు చేసుకుంటున్నాం. ప్రపంచంలోని 75దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి చేస్తోంది. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్​ సంస్థలను కోరుతున్నాను. ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోంది.”
-నరేంద్ర మోదీ, భారత దేశ ప్రధాని

Read more RELATED
Recommended to you

Latest news