శివరాత్రి ప్రత్యేకం.. పంచభూత క్షేత్రాలు మీకు తెలుసా!

-

పెండ్లికానివారు, పిల్లలు పుట్టనివారు ఈ పంచభూత క్షేత్రాలలో పూజలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని పండితుల అభిప్రాయం. శివరాత్రి పర్వదినం సందర్భంగా పంచభూత క్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాశివుడు.. శంకరుడు.. మహాదేవుడ్ని పంచభూతాత్ముడుగా వర్ణిస్తారు. ఆరాధిస్తారు. ఈ క్షేత్రాల సందర్శన వల్ల జాతకదోషాలు, జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాలు పేర్కొన్నాయి. మార్చి 4 శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయా క్షేత్రాల గురించి తెలుసుకుందాం. కలిలో ఆయా క్షేత్రాలను సందర్శించలేనివారు వాటి ప్రాశస్త్యం తెలుసుకుని మననం చేసుకుంటే చాలు దర్శన ఫలం వస్తుందని శాస్ర్తాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో క్షేత్రం ఒక్కో ప్రత్యేకం. వాయులింగాన్ని దర్శించి పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయని ప్రసిద్ధి. పెండ్లికానివారు, పిల్లలు పుట్టనివారు ఈ క్షేత్రంలో పూజలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని పండితుల అభిప్రాయం.. ఇక అరుణాచలేశ్వరం అంటే సాక్షాత్తు అపర కైలాసంగా చెప్తారు. ఇక్కడకి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే తప్ప వెళ్లలేమని, గిరి ప్రదక్షణ ఇక్కడి ప్రత్యేకం. శివరాత్రి పర్వదినం సందర్భంగా మన మనస్సును శివమయం చేసుకునే భాగంగా ఆయా క్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం….

shivaratri-special-do-you-know-panchabutha-kshetralu

పృథ్వీలింగం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వరుడు శివుడు వెలిసాడు. పృథ్వీలింగ రూపంలో శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. కాత్యాయనీ మహర్షి కూతురుగా పెరిగిన పార్వతీదేవి శివున్ని భర్తగా పొందేందుకు ఈ ప్రాంతానికి చేరుకుని సైకత లింగాన్ని తయారుచేసుకుని తపస్సు చేసింది. ఆ తర్వాత శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చి ప్రత్యక్షం అయి పార్వతీదేవిని వివాహం చేసుకుని ఇక్కడే కొలువైనాడు.

శివకంచిలోని లింగం పృథ్వీ (మట్టితో) లింగం కాబట్టి ఇక్కడ అభిషేకం ఉండదు. మల్లెనూనెతో అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకం. ఈ క్షేత్రంలో కంచి కామాక్షిగా ప్రసిద్ధి చెందింది. చెన్నై నుంచి 76 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది.

జలలింగం

జంబుకేశ్వరంలో జలలింగంగా శంకరుడు వెలిశాడు. పూర్వం శంభుడు అనే రుషి నిత్యం చేస్తున్న అభిషేకాలు, పూజలకు మెచ్చి ఆయన కోరిక మేరకు జలలింగంగా ఇక్కడ వెలిశాడు. ఈ స్వామిని జంబుకేశ్వరస్వామిగా పిలుస్తారు. ఇక్కడ లింగం నీటిలో తయారైంది కాదు. అయితే స్వామివారు చుట్టూ ఉన్న పావవట్టం నుంచి లింగం చుట్లూ నీరు ఊరుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ అఖిలాండేశ్వరిగా పిలుస్తారు. ఈ క్షేత్రం శ్రీరంగం క్షేత్రానికి 4 కి.మీ. దూరంలో ఉంటుంది.

shivaratri-special-do-you-know-panchabutha-kshetralu

అగ్నిలింగం

ప్రసిద్ధిగాంచిన అరుణాచలం(తిరువణ్ణాములై)లో అగ్ని లింగం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు తాను గొప్ప అంటే తాను గొప్ప అని తగువులాడుకున్న సందర్భంలో శివుడు వారి అహంకారాన్ని తొలిగించేందుకు అగ్ని లింగరూంలో వారి మధ్య నిలిచి తన ఆది, అంతాలను కనుగొనమని పరీక్షపెట్టాడు. ఇద్దరూ విఫలమై శివున్ని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలను మన్నించిన శివుడు తేజోలింగరూప ధారియై శ్రీ అరుణాచలేశ్వరుడిగా కొలువుదీరినట్లు పురాణగాథ. స్వామి వారి లింగం వలయాకారంగా,రుద్రభాగం బంగారు దేవరి శ్రీ అన్నామలై అమ్మనేగా ప్రసిద్ధి. చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది రమణమహర్షి తపస్సు ఆచరించిన క్షేత్రం కూడా.

వాయులింగం

శ్రీకాళహస్తీలోని శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం. సాలెపురుగు, సర్పం, ఏనుగు పోటీపడి శివున్ని ఆరాధించి శివునిలో ఐక్యమైన ప్రాంతాన్ని భూలోకంలో చూసేందుకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు స్వర్ణముఖీ నదీతీరంలో ఉండిపోయినట్లు గాథ. శ్రీకాళహస్తి గర్భాలయంలో స్వామివారు వాయులింగంగా ఉన్నారు. శివలింగం పై భాగంలో ఐదుతలల శేషుడు, పానువట్టం నుంచిపై భాగం వరకు తెల్లని రెండు ఏనుగు దంతాలు, కింద సాలీడు ఆకారం ఉంది. స్వామి వారికి కవచం ఉంచి పూజలు నిర్వహిస్తారు. స్వామి వారి దేవాలయంలో రెండు దీపాలు ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని జ్ఞానప్రసూనాంబగా ఆరాధిస్తారు. ఈ క్షేత్రంపై బ్రిటీష్ పాలకులు సైతం ప్రయోగాలు చేసి ఇక్కడ వాయురూపంలో దేవుడు ఉన్నాడని నిర్ధారణకు వచ్చారు. శ్రీకాళహస్తి తిరుపతికి 36 కి.మీ. దూరంలో ఉంది.

ఆకాశలింగం

చిదంబరంలోని శ్రీ నటరాజస్వామిని ఆకాశలింగంగా పేర్కొంటారు. పూర్వం ఆదిశేషుడు పతంజలిగా జన్మించి పరమేశ్వరుడిని సేవిస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడ తపస్సు చేయగా శివుడు మెచ్చి నాట్యభంగిమలో దర్శనమిచ్చి పతంజలి మహర్షి కోరియ మేరకు ఇక్కడ కొలువైనట్లు పురాణ గాథ. గర్భాలయంలో స్వామిని నటరాజస్వామిగా దర్శనమిస్తారు. పక్కనే ఒక గదిలో గోడకు యంత్రం ఉంది.అది ఎవరికి కన్పించదు. ఇదే ఆకాశరూపం. ఇక్కడి క్షేత్రంలో అమ్మవారిని శ్రీ శివకామసుందరీదేవిగా ఆరాధిస్తారు. ఈ క్షేత్రం చెన్నైకు 250 కి.మీ. దూరంలో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news