Breaking : 10 నిమిషాల్లో 3 బాటిళ్లు తాగి.. ఆ తరువాత

-

అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీలోని ఆగ్రాలో ఓ వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగుతానని తన స్నేహితులతో పందెం వేసి తన ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జై సింగ్. వయసు 45 ఏళ్లు. ఆగ్రాలో ఈ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మిత్రుల పందెం అతడి పాలిట ప్రాణాంతకంగా మారింది.

3 చీప్ లిక్కర్ బాటిళ్లను 10 నిమిషాల్లో తాగగలవా? అంటూ అతని ఇద్దరి స్నేహితులు కేశవ్, భోలా సవాల్ చేశారు. ఒకవేళ మద్యం తాగలేకపోతే, మిత్రులు ఎంత తాగుతారో అంత మొత్తానికి తానే బిల్లు చెల్లిస్తానని పందానికి అంగీకరించాడు జై సింగ్. అనంతరం, వెనుకా ముందూ ఆలోచించకుండా మూడు క్వార్టర్ల మద్యం గడగడా పది నిమిషాలలో తాగేశాడు. దాంతో అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు.

అతడిని కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరికి ఎస్ఎన్ మెడికల్ కాలేజీ వద్దకు తీసుకువచ్చేసరికి, అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన జై సింగ్ కు నలుగురు మైనర్ సంతానం ఉన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జై సింగ్ ఇద్దరు స్నేహితులైన భోళా, కేశవులను అరెస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news