టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తాజాగా ఓ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ ఈవెంట్ కు యాంకరింగ్ చేస్తున్న సుమన్ ఉద్దేశించి కొన్ని సరదా కామెంట్స్ చేశారు. అయితే ఇవి ఇండైరెక్ట్ గా రాజీవ్ కనకాల పరువు తీసేశాయి అంటూ అభిప్రాయపడుతున్నారు నెటిజెన్లు.త్రివిక్రమ్ తాజాగా ఓ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు విషయాన్నీ పక్కనపెట్టి యాంకర్ సుమను టార్గెట్ చేశారు. మాటల సందర్భంగా..
“ప్రతి రోజూ నేనే వంట చేస్తాను. ఇవాళ ఈవెంట్ కి వచ్చాను కాబట్టి మా ఆవిడ చేస్తుంది. కాబట్టి మీ అందరి తరపున ఆమెకు శుభాకాంక్షలు. సుమ గారిని ఎప్పుడు చూసినా పొగడాలనిపిస్తుంది. ఆమె చాలా బిజీ పర్సన్. ఇంట్లో వంట కూడా రాజీవ్ కనకాలనే చేస్తారు. సుమ ఎప్పుడూ ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది. ఒకసారి మా ఆవిడ గ్యాస్ స్టవ్ మంట తగ్గించమంది. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అని అడిగాను. అప్పటి నుండి మా ఆవిడ నన్ను వంట గదిలోకి రానివ్వదు..” అంటూ చెప్పుకొచ్చారు.. అన్నారు.
అయితే త్రివిక్రమ్ ఇక్కడ ఒక క్లారిటీని మిస్ అయ్యారనే చెప్పాలి. ప్రతిరోజు ఇంట్లో నేనే వంట చేస్తానని చెప్పుకొచ్చిన ఆయన మా ఆవిడ అసలు నన్ను వంట ఇంట్లోకే రానివ్వదు అంటూ కవర్ చేసేసారు. అంటే ఈ విషయం సరదాగా అన్నారని అనుకోవచ్చు కానీ ఈ విషయంలో రాజీవ్ కనకాల అని ఘోరంగా బుక్ చేసేసారని అనుకోవాలి. సుమ ఈవెంట్లతో బిజీగా ఉంటారు కాబట్టి ఇంట్లో రాజీవ్ పని లేకుండా ఉంటూ వంటలు చేస్తున్నారా అని ఆయన కామెంట్స్ ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏదో సరదాకి కాసేపు అందర్నీ నవ్వించాలని ఉద్దేశంతో రాజీవ్ కనకాలను త్రివిక్రమ్ బుక్ చేసేసారు అని అర్థాలు తీస్తున్నారు కొందరు నెటిజన్లు.