పుష్ప-2 ఆఫర్‌ను తిరస్కరించిన సమంత..?

-

 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా పార్ట్‌ 1 బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్.

అయితే సీక్వెల్ లో సుకుమార్ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. ఐటెమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆఫర్ ను సామ్ తిరస్కరించింది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితి, బిజీ షెడ్యూల్ కారణంగా నటించలేనని సమంత చెప్పినట్టుగా పలు వెబ్సైట్ లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై ఎట్టకేలకు సమంతా టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. నిజానికి పుష్ప-2 లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించనేలేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news