గుజరాత్ నుంచి హైదరాబాద్ కు పెట్టుబడులు: కేటీఆర్

-

పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ మహానగరం నిలుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణలో అనువైన వాతావరణం ఉన్నందునే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, వెల్ స్పన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుజరాత్ నుంచి వచ్చి వెల్‌స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో చందన్ వెల్లిలో 3000 నుంచి 5000 కోట్ల పెట్టుబడి పెడతామన్న సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకాకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మహిళలను భాగస్వామ్యుల్ని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

చందన్ వెల్లిలో తయారయ్యే సగం ఉత్పత్తులు సిలికాన్ వ్యాలీకే వెళ్తాయన్న వెల్ స్పన్ గ్రూప్ ఛైర్మన్ బాలకృష్ణ గోయెంకా… రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టి చందన్ వెల్లిని వెల్ స్పన్ వ్యాలీగా మారుస్తామని అన్నారు. మంత్రి కేటీఆర్ విజన్.. చందన్ వెల్లి టు సిలికాన్ వ్యాలీ అన్న ఆయన… సీఎం కేసీఆర్ అద్భుత దార్శనికతతో ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news