కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని నిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. వైద్య విద్యార్థిని కొన్ని అవయవాలు సరిగా పనిచేయడం లేదన్న ఆయన.. ఆర్ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం ప్రీతి చికిత్సను పర్యవేక్షిస్తుందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
ఆమె బీపీ, షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదన్నారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని… ఎక్మో సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే చివరి ప్రయత్నం అని వైద్యులు వెల్లడించారని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. వైద్యులు ఆమెకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారన్నారు.
మరోవైపు విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యప్తు చేసి నివేదికను డీఎంఈ రమేష్ కు అందిస్తామని తెలిపారు.