విజయ్ దేవరకొండ వదులుకున్న ఈ ఐదు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచారని తెలుసా..

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరియర్ లో హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ తాజాగా నటించిన లైజర్ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది పూరి జగనన్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది ప్రస్తుతం విజయ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విజయ్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు పై మరోసారి చర్చ జరుగుతుంది..

హీరో విజయ్ దేవరకొండ 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ మంచి పేరును సంపాదించుకున్నాడు. 2015లో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రలో కనిపించి అలరించాడు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ కు ప్లస్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత 2016లో నా పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో అతని పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అలాగే 2018 లో వచ్చిన గీతా గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకోవటంతో విజయ దేవరకొండ హీరోగా స్థిరపడిపోయారు. అయితే విజయ్ ఈ ప్రయాణంలో ఎన్నో హిట్ సినిమాలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్ఎక్స్ 100 చిత్రం. 2018 లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ రామ్ పూరి జగన్నాథ లను మళ్ళీ నిలబెట్టిందని చెప్పాలి. ఈ సినిమా కూడా మొదటగా విజయ్ దేవరకొండనే వరించింది. కానీ అతను కాదనటంతో రామ్ చేయాల్సి వచ్చింది.. అలాగే నితిన్ నటించిన హీరోగా వచ్చిన భీష్మ సినిమా, దుల్కర్ సల్మాన్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సీతారామమ్ కథలు కూడా విజయ్ దేవరకొండని వరించాయి. అయితే ఈ సినిమాలో అన్నిటిని డేట్స్ కుదరకపోవడంతో విజయ్ వదిలేసుకున్నారు అంట. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఈ సినిమాలన్నీ విజయ్ చేసి ఉంటే అతని కెరియర్ ఈరోజు చాలా బాగుండేది అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news