బడా బిజినెస్ మ్యాన్ కూతురుతో హీరో శింబు పెళ్లి.. హీరో తండ్రి క్లారిటీ..!

-

తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేవలం కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈయన వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నటుడు గానే కాకుండా రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కూడా అనేక సూపర్ హిట్టు పాటలను ఆలపించారు. ఇకపోతే శింబు వ్యక్తిగత విషయాలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో లవ్ , ఎఫైర్స్, డేటింగ్ రూమర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. ముఖ్యంగా తెలుగు, తమిళ్ హీరోయిన్లతో ఈయన ప్రేమాయణం నడిపినట్లు టాక్ కూడా నడిచింది.

కానీ ఎట్టకేలకు ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురితో శింబు ఏడడుగులు వేయనున్నాడు అని సమాచారం. ఆమెతో ఈ హీరో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని, ఆ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్ అని తెలుస్తోంది . ఆమె తండ్రి కి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయట. అంతేకాదు ఆ అమ్మాయి శింబు కి వీరాభిమాని కావడం.. ఈ క్రమంలోనే ఒకసారి ఆయనను కలవడం .. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వీరి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట . త్వరలోనే వివాహ వేదిక, తేదీని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపోతే త్వరలోనే తన కుమారుడు శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయన తండ్రి డి రాజేంద్రన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం తో నిజమేనని నమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news