సోష‌ల్ మీడియాలో మీమ్స్ మానియా

-

‘‘వీలైతే ప్రేమిద్దాం డూడ్. మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే’’ అనే మిర్చి సినిమా డైలాగ్అప్పట్లో ట్రైలర్ నుంచే జనాల్లోకి ఎక్కేసింది. దానిని ‘వీలైతే పేజీని లైక్ చేద్దాం డూడ్, మహా అయితే తిరిగే ఎంటర్ టేయిన్ చేస్తారు` అని పేరడీ చేసి ఫేస్ బుక్ లో చేసిన పోస్టు వైరల్ అయింది. . శ్రీమంతుడు సినిమాలో ఇలాగే ఇన్స్టంట్ గా ఎక్కేసే డైలాగు . ‘‘బ్యాడ్ అంటే మీలా కాదు.. అదో రకం’’ అంటూ మహేష్ చెప్పే డైలాగ్ అభిమానుల్లో ఓ మేనియా క్రియేట్ చేసింది.సోషల్ మీడియాలో ఈ డైలాగ్ రచ్చ రచ్చ చేసింది. దాన్ని పేరడీ చేసి ‘‘హిట్ అంటే అలా ఇలా కాదు. అదో రకం. బ్లాక్ బస్టర్’’ అంటూ తగిలించారు. సినిమాల్లో ఉన్న పాపులర్ డైలాగులను నిజ జీవితానికి అన్వయించుకుని పేరడీలు సృష్టిస్తున్నారు. ఫేస్ బుక్ లో అయితే ఇలాంటి వాటికోసం ఉన్న పేజీలకు, వాటిలో పేలుతున్న డైలాగులకు లెక్కేలేదు.సృజనాత్మకత తో క్రియేట్ చేసి వదులుతున్న ఈ డైలాగులు నెటిజన్స్ తో వాహ్..క్యా డైలాగ్ హై అనిపిస్తున్నాయి.

ఒకప్పుడు పేరడీ అంటే కేవలం పాటలకు మాత్రమే రాసేవారు. క్ర మంగా తెలుగు సినిమాల్లో వాడిన పేరడీ డైలాగులు అభిమానులకు చేరువయ్యాయి. ఇలా ఒరిజినల్‌ డైలాగులకు పేరడీగా వాడిన మాటలూ ఇప్పుడు బాగానే పేలుతున్నాయి. .ఒక విధంగా చెప్పాలంటే సినిమా తర్వాత ఇలాంటి పేరడీ డైలాగులకు ఫేస్ బుక్ లోనే ఎక్కువ స్పందన ఉందని చెప్పవచ్చు…… అలాంటి పేజీలకు వేల మంది ఫాలోవర్లు, వీపరీతమైన రెస్పాన్ ఉంది. ‘ఆడు బీటెక్ రా బుజ్జీ’, స్వామి నదికి పోలేదా, తెలుగు ఫన్, కమెడీ పంచ్ డైలాగులు, తగలబెట్టండి డాట్ కం, ఫన్ రాజా ఫన్,కామెడీ టానిక్ .. అబ్బో ఇంకా ఎన్నో పేజీలు ఫేస్ బుక్ లో కోకొల్లాలుగా ఉన్నాయి.

ఒక్కో పోస్టు వెనక ఒక్కో కథ:
‘నా ప్రోఫైల్ పిక్ కి ఈ లైక్స్ సరిపోవు. చాల చాలా లైక్స్ కావాలి’ కుమారి 21 ఎఫ్ లో హీరోయిన్ హెబాపలేల్ డైలాగ్ గుర్తుకు వస్తుంది కదా… అంతే ఇప్పుడొక సినిమా రిలీజ్ అయి ఓ డైలాగ్ హిట్ అవడం ఆలస్యం రకరకాల అంశాలు తీసుకుని దానికి తగ్గట్టు పేరడీ రాసేసీ జనాల్లోకి వదలేస్తున్నారు. జంద్యాల కామెడీ డైలాగుల నుండి నేటి రాజకీయ, సినీరంగ, సామాజిక అంశాల వరకు పేరడీలు వచ్చేస్తున్నాయ్.. డైలాగులు, వాటికి తగ్గట్టు గా సినిమాలోని కారెక్టర్ ల ఫోటో లు పెట్టడం తో అచ్చు వారే ఆ పేరడీ డైలాగ్ చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ అబ్బాయ్ ఫాగ్ పెర్ఫ్యూమ్ ముందు కూర్చుని అలాగే చూస్తున్న ఫోటోను పైన పెట్టి, నాగార్జున ఫోటోను కింద పెట్టి ‘ ఎవడో ఫాగ్ నడుస్తుందని చెప్పాడు, నరికేయాలి వాడ్ని’ అని డైలాగ్ రాసారు, … ‘పెళ్లైన నెల రోజుల్లోపే ఉద్యోగం పోతే ఆ భాద ఎలా ఉంటదో నీకు తెలుసా..? నాకు తెలుసు… వర్క్ టెన్స్ష న్ తో వయస్సులో ఉన్నప్పుడే షుగరూ, బీపీ నువ్వెప్పుడైనా అనుభవించావా..? నేను అనుభవించాను’.. అంటు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కష్టాలను జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు క్రియేట్ చేశారు. ఆ సన్నివేశం కళ్లకు కట్టినట్టు కనబడుతుంది…
ఇలాంటి పోస్టులను సృష్టించి క్రమం తప్పకుండా అప్లోడ్ చేయడానికి సమయం, సృజనాత్మకత కావాలి, కానీ వాటికి ఆదరణ బాగా ఉండటంతో అడ్మిన్ లు ఆ పనిని ఇష్టంగా చేసుస్తున్నారు. ఇలాంటి పేజీలు నిర్వహించే వాళ్లలో ఎక్కువ మంది విద్యార్థులే అని చెప్పవచ్చు…. ఈ పేజీలు కేవలం ఫోటోలు, డైలాగులకే పరిమితం కావలట్లేదు. పెరిగిన టెక్నాలజీని వాడుకుని వీడియోలను కూడా పేరడీ చేస్తున్నారు. ఓ సినిమాలో హిట్టైన సన్నివేసాన్ని ఎంచుకుని ఆ క్యారె క్టర్ల మద్య జరిగిన సంభాషణను ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అన్వయిస్తూ, డబ్బింగ్ చెప్పేసీ చిన్న వీడియోగా రూపొందించి వదులుతున్నారు. అవును పాతాళబైరవి సినిమా నుండి పవన్ కళ్యాన్ సినిమాల వరకు పేరడీ వీడియోలు వచ్చేసాయి. ఈ మధ్య జరిగిన సర్జికల్ స్ర్టైక్ ను, జియో సంచలనాలను ఉద్దేశించి విపరీతమైన స్పూఫ్ లు ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టాయి. పెట్రోల్ రేట్ల పెరుగుదలను గురించి ‘అత్తారింటికి దారేది’ సినిమా క్లైమాక్స్ సీన్ లో పవన్ కళ్యాణ్ చెప్పిట్టు గా ‘క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిందని, పెట్రోట్ రేట్ పెంచేశారు. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గంగానే పెట్రోల్ రేట్ తగ్గించాలత్తా.. ఒక్క సారి తగ్గించడానికి ట్రై చేయండత్తా.. తగ్గించడం అంటే మూడు రూపాయలు తగ్గించడం కాదత్తా, జనం నమ్మేలా తగ్గించడం. అందుకే ప్రభుత్వం ఎన్నీ చెప్పిన పెట్రోల్ రేట్ తగ్గిందని జనం అనుకోవట్లేదు అత్తా’ అంటూ ‘పెట్రోల్ బంకుకు దారేది’ అనే టైటిల్ తో వదిలిన వీడియో బాగా పాపులర్ అయింది.

ఆ పోస్టులకు వచ్చే స్పందనే వేరప్పా…
ఈ పేరడీల్లో హస్యానికే పెద్ద పీఠ వేసిన రోజూవారి పరిస్థితులకు అన్వయించటంతో ఆలోచింపజేస్తున్నాయి. ఇలా చెప్పు కుంటూ పోతే లెక్కలేనన్నీ ‘స్ఫూఫ్ ‘ లు కనిపిస్తాయి. .. ఒక పోస్టును క్రియేట్ చేయటం అంటే మాములు మాట కాదు. ముందు దేనిపైన పేరడీ రాయలో ఆలోచించాలి, దానికి తగ్గట్టు డైలాగ్ ఏ సినిమాలో ఉందో ఊహించాలి, దానికి సంబందించిన ఫోటోలను లేదా వీడియోలను వెతుక్కోవాలి, ఎడిటింగ్ లోకి తీసుకోవాలి… చాలా పెద్ద పనే కాని ఒక్క సారి ఫేస్ బుక్ అప్ లోడ్ చేసాక దానికి వచ్చే స్పందన చూసాక ఈ ప్రక్రియ ఆపడం కస్టమనిపిస్తుంది. ఎంతైనా క్రియేటివిటీని వెలికితీయడానికి ఫేస్ బుక్ ని ఇలా కూడా వాడుకోవచ్చు కదా…

——————————————————–
కొన్ని ఫేస్ బుక్ పేజీల లింకులు ……
www.facebook.com/thagalabettandidotcom/
www.facebook.com/ComedyTonic/
www.facebook.com/telugufunposts/?fref=ts
www.facebook.com/ComedyMemesTelugu/?fref=ts
www.facebook.com/comedypunches/?fref=ts
www.facebook.com/jokesnfunnypictures/
www.facebook.com/swaminadhikipoleda/
www.facebook.com/TeluguMovieComedy/ `

Read more RELATED
Recommended to you

Latest news