స్వగ్రామానికి ప్రీతి మృతదేహం.. భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు

-

ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి నిమ్స్‌ ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో ఆసుపత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.  ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిమ్స్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు యత్నించగా ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ప్రీతి మృతిచెందడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రీతికి ఇంజక్షన్‌ ఇచ్చారని ఆరోపించారు.

ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. దీంతో ప్రీతి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీకి తరలించారు. శవపరీక్ష పూర్తి అయిన అనంతరం పోలీసు భద్రత మధ్య కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రీతి మృతదేహాన్ని స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  పోలీసుల భారీ బందోబస్తు మధ్య ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news