ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు నుండి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దాకా మార్చి 1 నుంచి 5 కొత్త రూల్స్..!

-

ప్రతీ నెలా కూడా ఏదో ఓ కొత్త రూల్ వస్తూ ఉంటుంది. కొన్ని అంశాల్లో ప్రతీ నెలా మార్పులు వస్తూనే ఉంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని అంశాల్లో మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను ఇలా కొన్ని విషయాల్లో మార్పులు వచ్చాయి. మరి మర్చి నెల లో ఏయే మార్పులు రాబోతున్నాయి చూసేద్దాం.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు:

ప్రతి నెల ఒకటో తేదీ నుండి ఆయిల్‌ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ ధరల్లో మార్పులు
చేస్తారు. ఈసారి కూడా మార్చి 1న గ్యాస్‌ సిలిండర్ ధర పెరగవచ్చు లేదంటే
తగ్గవచ్చు. లేదంటే ఇలానే ఉండచ్చు.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్‌ కార్డు కొత్త ఛార్జీలను ప్రకటించింది. పెంచిన కొత్త ఛార్జీలు మార్చి 17,2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా అద్దె చెల్లింస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.99గా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని డబుల్‌ చేసింది.

బ్యాంకు లోన్స్:

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచారు. వివిధ రకాల రుణాల పై వడ్డీ రేట్లు పెంచేసాయి. రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్:

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పెన్షన్ పెరుగుతుంది. చందాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 3, 2023 చివరి గడువు.

సోషల్‌ మీడియా ఫిర్యాదులు:

సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు మూడు ఫిర్యాదులు అప్పీలేట్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news