ఇకపై నన్ను ఏదీ బాధించలేదు.. సమంత ఎమోషనల్ పోస్టు

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఎమోషనల్ అయింది. అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని..  ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ ట్వీట్ చేసింది. నటిగా తాను తొలి అడుగు వేసి 13 ఏళ్లు అయిన సందర్భంగా.. అభిమానులను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టును తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

‘‘నేను ఎంత ఎదిగినా.. ఎంత దూరం ప్రయాణించినా.. మీరు చూపించే ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను. నాపై ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే, కొత్త విషయాలను పరిచయం చేస్తోన్న ప్రతిరోజుకూ కృతజ్ఞతలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధించేవి.. కానీ, ఇకపై కాదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో కొనసాగుతున్నా’’ అని సమంత రాసుకొచ్చారు.

‘ఏమాయ చేసావె’ సినిమాతో సామ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో నాగ చైతన్య-సామ్ కెమిస్ట్రీకి తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఇప్పటికీ సామ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఫీల్‌ గుడ్‌ ప్రేమకథగా దీన్ని గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించారు. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈసినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news