ఏదైనా వాహనం మీద వెళ్లాలంటే లైసెన్స్ తప్పక ఉండాలి. లైసెన్స్ లేకుండా ఏదైనా వాహనం మీద బయటకి వెళ్లడం రిస్క్ ఏ. ఆయితే మీరు కనుక తరచూ బయటకి వెళ్తున్నప్పుడు లైసెన్స్ ని మరచిపోతున్నట్టయితే ఇలా చెయ్యడం మంచిది. మీ దగ్గర లైసెన్స్ ఉండవలసిన పని లేదు.
లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా పర్లేదు కేవలం ఈ ఒక్క యాప్ ఉంటే సరిపోతుంది. డీజీ లాకర్ యాప్ ద్వారా మీరు ముఖ్యమైన డాక్యుమెంట్‌లను అప్ లోడ్ చేసుకో వచ్చు. ఈ ఒక్కటే కాదు మీరు ఈ యాప్ లో ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవేమైనా సరే ఉంచచ్చు. దానితో
ఈ పత్రాలు సులభంగా ఇందులో సేవ్ అవుతాయి.
ఒకవేళ మీరు బయటకి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ని మరచిపోతే ఈ డిజిలాకర్ యాప్‌లోని DL హార్డ్ కాపీని చూపించ వచ్చు. ఇలా ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ ని మీరు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపటానికి కావలసిన డాక్యుమెంట్స్ ని ఉంచేందుకు యాప్ లని తీసుకు రావడం జరిగింది. Digilocker, mParivahan మొబైల్ యాప్‌లు వున్నాయి. వీటిని మీరు ఉపయోగించుకుని డాక్యుమెంట్స్ ని భద్రపరుచుకోవచ్చు.