ఏపీకి కేంద్రం శుభవార్త.. మరో రూ.3 కోట్ల అప్పుకు అనుమతులు !

-

ఏపీకి కేంద్రం శుభవార్త.   విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్న AP ప్రభుత్వానికి కేంద్రం నుంచి మరోసారి అప్పు పొందేందుకు చేయూత లభించింది. ఫిబ్రవరిలో రెండో దఫాగా రూ.2,929కోట్లను రుణంగా తీసుకునేందుకు అనుమతి వచ్చింది. దీంతో కలిపితే ఆర్థిక సంవత్సరంలో రూ.55,718 కోట్లు బహిరంగ మార్కెట్ ద్వారా రుణాలు పొందేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఇందులో ఫిబ్రవరిలోనే రూ.5,858 కోట్ల మేర రుణం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. విద్యుత్ సంస్కరణల అమలు నేపథ్యంలోనే కొత్త అప్పు తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇంధనశాఖ సిఫార్సు మేరకే రుణం తీసుకునేందుకు పచ్చ జెండా ఊపింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలు తమ జిఎస్డిపీలో 0.5% మేర అదనపు రుణం తీసుకునేందుకు వీలుగా కేంద్రం గతంలో రుణ నిబంధనలను సవరించింది.

Read more RELATED
Recommended to you

Latest news