చాలా మందికి ట్రావెల్ చేయడం అంటే ఎంతో ఇష్టం చక్కటి ప్రదేశాలని చూడాలని మంచి మంచి చోట్లకి వెళ్లాలని అనుకుంటుంటారు. మీరు కూడా ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా నార్త్ ఈస్ట్ లో చూడదగ్గ ప్రదేశాల గురించి చూడండి. ఈ ప్రదేశాలను చూస్తే కచ్చితంగా మీకే వెళ్లాలని అనిపిస్తుంది. మరి ఇక నార్త్ ఈస్ట్ చూడదగ్గ ప్రదేశాల గురించి చూద్దాం.
గ్యాంగ్ టక్:
ఈశాన్య రాష్ట్రాల్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఇది ఒకటి సిక్కిం లోని గ్యాంగ్ టక్ చూసేందుకు చాలా బాగుంటుంది. ఇక్కడ మేఘాలు కాళ్ళ కింద ఉన్నట్లు అనుభూతిని ఇస్తాయి.
షిలాంగ్:
మేఘాలయ లోని షిలాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ జలపాతాలు కొండ ప్రాంతాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. అందరికీ ఇది నచ్చేస్తుంది,
పెల్లింగ్:
సిక్కిం లోని పెల్లింగ్ కూడా ఎంతో బాగుంటుంది తెల్లని మేఘాలు ఆకుపచ్చని బ్యాక్ డ్రాప్ తో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడికి ప్రకృతి ప్రేమికులు వెళ్లారంటే ఫిదా అయిపోవాల్సిందే.
ఐజ్వల్:
కొండ పైన ఇళ్ల తో ఇక్కడ చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. ఈ ప్రదేశం కూడా చక్కటి అనుభూతిని మీకు ఇస్తుంది.
చీరపుంజి:
అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది. ఇక్కడకి కూడా పక్కా వెళ్లాల్సిందే.
తవాంగ్:
ఈశాన్య రాష్ట్రాల్లో తవాంగ్ కూడా చూడదగ్గ ప్రదేశమే. ఇక్కడ సాంప్రదాయాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. నార్త్ ఈస్ట్ లో చూడదగ్గ వాటిలో ఇదీ ఒకటి. మిస్ అవ్వద్దు.