భార్యాభర్తలు తల్లిదండ్రులు అయిన క్షణాలు చాలా మధురం.. అప్పటి వరకూ ఇద్దరుగా ఉన్నవాళ్లు ముగ్గురు అవుతారు.. వారి ప్రపంచం అంతా ఆ బిడ్డే అయిపోతుంది. వారి ఆలనాపాలన చూసుకోవడంతోనే తల్లికి సరిపోతుంది. ఇదంతా కాయిన్‌కు వన్ సైడ్ అయితే.. పిల్లలు పుట్టిన ఏడాది తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు తెలిసే ఉంటుంది.. పిల్లలు అర్థరాత్రుళ్లు లేచి ఏడుస్తారు.. వారికి పాలు ఇవ్వడం, లాలించడంతోనే రాత్రి అయిపోతుంది. ఎప్పుడో తెల్లవారజామున పడుకుంటారు..దీని వల్ల తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన మొదటి ఏడాదిలో ఎంత నిద్ర కోల్పోతారో తెలుసా..? ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ..! ఎంత అనుకుంటున్నారు..??
కొత్తగా తల్లిదండ్రులైనవారు ప్రతిరోజు రాత్రి 4 గంటల నిద్రను కోల్పోతారు. నవజాత శిశువుల తల్లిదండ్రులు వారి శిశువు జీవితం మొదటి సంవత్సరంలో 1,456 గంటల నిద్రను త్యాగం చేస్తారట. బిడ్డ ఏడుపు కారణంగా 10 మందిలో 9 మంది నాలుగు గంటల నిద్రను కోల్పోతారని సర్వేల ద్వారా తెలిసింది. రాత్రిపూట తడి న్యాపీ, ఆకలి కారణంగా పిల్లలు మేల్కొంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
తల్లులకే శ్రమ ఎక్కువ..
ముగ్గురిలో ఒకరు తమ బిడ్డ రాత్రిపూట నిద్రపోవడం అనేది అప్పుడప్పుడు మాత్రమే అని అంటున్నారు. మొదటి-సంవత్సరం పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా.. తల్లిదండ్రులను నిద్రపోనివ్వకుండా చేస్తారు. బిడ్డను పడుకోబెట్టడంలో తల్లులే ఎక్కువగా పనిచేస్తారని సర్వేలో తేలింది. తండ్రులు ఆరుగురిలో ఒకరు మాత్రమే పిల్లలను పడుకోబెడుతున్నారట..10 మందిలో దాదాపు ఆరుగురు మహిళలు తమ శిశువును ఎలా నిద్రపుచ్చాలో వారి తల్లుల సలహాను కోరుకుంటారు.
శిశువు మెుదటి పుట్టిన రోజు వరకు సుమారు 133 నుంచి 150 రోజుల నిద్రను తల్లిదండ్రులు కోల్పోతున్నారు. ఈ స్థాయి నిద్ర లేమి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. నిద్ర లేమి తల్లిదండ్రుల ఎక్కువగా మతిమరుపు కలిగి ఉంటారు. అయితే ఇలా కచ్చితంగా అందిరిలో జరుగుతుంది అని చెప్పలేం.. కానీ చాలామందిలో ఇదే జరుగుతుంది.
పగటి పూట ఉద్యోగం, ఇంటి పనితో సరిపోతుంది.. దాంతో మధ్యాహ్నం పడుకునే వెసులుబాటు తల్లికి ఉండదు. పిల్లలు ఉదయం పడుకోని రాత్రుల్లు మేల్కొంటారు. అర్థరాత్రి లేచి గుక్కపెట్టడం వల్ల తల్లికి నిద్ర ఉండదు.. ఇలా చాలామంది తల్లులు నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే.. తమ బిడ్డను నిద్రపోయేలా చేయడానికి కారులో క్రమం తప్పకుండా తిప్పుతున్నారట..
అందుకే పిల్లలు ఉన్న ఇంట్లో అమ్మమ్మో, నానమ్మో ఉంటారు.. వారి ఆలనాపాలనా పెద్దోళ్లకు అప్పగించి తల్లిందండ్రులు ఉద్యోగాలు చేసుకుంటారు..! అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా..!