పేరుకు కవలలు..కానీ వీరిద్దరి మధ్య ఉన్న హైట్‌ తేడాతో..గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

-

సాధారణంగా కవల పిల్లలంటే.. చూడ్డానికి ఒకేలా ఉంటారు. బరువు, ఎత్తు కూడా ఇంచు మించు ఒకటే ఉంటారు. దీనికి తోడు వీళ్లు బట్టలు, హెయిర్‌స్టైల్‌ అంతే సిమిలర్‌గా ఉండేవే వేసుకుంటారు. కవలపిల్లలను గుర్తించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఏవో కొన్ని తేడాలు మాత్రమే ఉంటాయి.. కానీ వీళ్లు మాత్రం టూ డిఫ్రెంట్. వీళ్లు పేరుకే కవలలు. కానీ వీళ్ల ఎత్తు మాత్రం చాలా అంటే చాలా తేడా.. ఒకరు రెండు అడుగులు అయితే… మరొకరు ఐదు అడుగులు..ఈ తేడాతోనే వీళ్లు ఇప్పుడు గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నారు.

జపాన్‌కు చెందిన కవల సోదరీమణులు అసాధారణ ఎత్తు తేడాతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరారు. జపాన్‌లోని ఒకాయమాలో నివసించే సోదరి యోషీ, మిచీ కికుచి మధ్య 75 సెం.మీ (2 అడుగుల 5.5 అంగుళాలు) తేడా ఉంది. కవలలు అంటే ఒకేలా కనిపించే వ్యక్తులుగా భావిస్తాం. కానీ 33 ఏళ్ల ఈ సోదరీమణులకు, వారి ముఖ లక్షణాలు మరియు ఎత్తు వారిని వేరు చేసింది. యోషీ ఎత్తు 162.5 సెం.మీ (5 అడుగుల 4 అంగుళాలు), మిచీ 87.5 సెం.మీ (2 అడుగుల 10.5 అంగుళాలు) వద్ద ఉంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి కథను ట్విట్టర్‌లో పంచుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పత్రికా ప్రకటన ప్రకారం.. వీళ్లు..15 అక్టోబరు 1989న జన్మించారు. మిచీకి పుట్టుకతో వచ్చే వెన్నెముక ఎపిఫిసల్ డైస్ప్లాసియా అనే ఒక వ్యాధి ఉంది. దాంతో ఆమె ఎత్తు పెరగలేదు..

మిచీ తన తల్లిదండ్రుల ఇంటిలో నివసిస్తుంది. ఆమె తన తండ్రి నిర్వహించే దేవాలయంలో రోజువారీ నిర్వహణలో సహాయం చేస్తుంది. యోషీకి పెళ్లైంది…

సో.. వీళ్ల స్టోరీతో కవలలు అంటే జీరాక్సీ కాపీలా ఒకలానే ఉండరు.. వ్యత్యాసాలు ఉంటాయని కూడా తెలిసింది. ఇలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉంటారు.

https://twitter.com/GWR/status/1629194700442972160?s=20

Read more RELATED
Recommended to you

Latest news