ప్రీతి కేసుపై మాణిక్ రావు ఠాక్రే సీరియస్‌

-

డాక్టర్ ప్రీతి సూసైడ్ ఘటనపై ఇంకా ఎన్నో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి . ప్రీతి విషయంలో తమకు చాలా అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రీతి కుటుంబసభ్యలు. ర్యాగింగ్ వల్ల ప్రీతినే ఆత్మహత్య చేసుకుందని ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చదివి ఎండి కావాలనుకున్న ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని అన్నారు ఆయన. ఒక మెడికల్ కాలేజి విద్యార్థి చనిపోతే.. ఇప్పటివరకు తోటి విద్యార్థులు ఆమె కుటుంబసభ్యుల్ని పరామర్శించకపోవడం చాలా దారుణమన్నారు.

Manikrao Thakre, माणिकराव ठाकरे यांनी शिवसेनेच्या 'या' मंत्र्याची केली  तक्रार; म्हणाले... - congress leader manikrao thackeray complaints against  the shiv sena minister - Maharashtra Times

ప్రీతి చిత్రపటానికి నివాళులు అర్పించిన మాణిక్ రావు ఠాక్రే.. ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు ఒత్తిడిగి గురవుతున్నారని మాణిక్ రావు ఠాక్రే వ్యక్తపరిచారు. ప్రీతి నాలుగు గంటల పాటు ఆపరేషన్ థియేటర్‭లో ఉన్న సమయంలో ఏం జరిగిందో ఆమె కుటుంబసభ్యులకు చెప్పాలని డిమాండ్ చేశారు మాణిక్ రావు. ఇంత జరుగుతున్నా.. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనపై పూర్థిస్థాయిలో దర్యాప్తు జరగాలని.. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాణిక్ రావు ఠాక్రే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news