అమ్మాయితో వీడియో కాల్​ మాట్లాడుతూ.. మర్మాంగం కట్​ చేసుకున్న యువకుడు

-

ఓ యువకుడు తన ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశంలో అతడు తన బ్లేడ్​తో మర్మాంగాన్ని కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలేం జరిగిందంటే..?

పశ్చిమ బంగాల్​లోని కుచ్​బెహర్​ ప్రాంతానికి చెందిన ప్రసన్నజీత్​ బర్మన్​ అనే యువకుడు ప్రస్తుతం గుజరాత్​లోని రాజ్​కోట్​లో తన మామయ్య శపన్​ బర్మన్​తో కలిసి ఉంటున్నాడు. అక్కడే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రసన్నజీత్​కు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రసన్న తరచూ వీడియో కాల్ మాట్లాడేవాడు.

కొన్నిరోజుల క్రితం ప్రసన్నజీత్​ తన ప్రేయసితో వీడియోగా మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల గొడవ తలెత్తింది. దీంతో ప్రసన్నజీత్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. వీడియోకాల్​లో తన ప్రేయసి చూస్తుండగానే.. పక్కనే ఉన్న బ్లేడ్​తో తన మర్మాంగంపై దాడి చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న శపన్​ రక్తపు మడుగులో పడి ఉన్న తన అల్లుడ్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే ప్రసన్నజీత్​కు చికిత్స అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news