తలనీలాల టికెట్ ధరను భారీగాపెంచిన రాష్ట్ర ప్రభుత్వం!

-

తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు నెలకు కనీసం రూ. 20 వేల చొప్పున కమిషన్ ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ముఖ్యకార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు నెలకు కనీసం రూ. 20 వేల చొప్పున కమిషన్ ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ముఖ్యకార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భక్తుల నుంచి వసూలు చేస్తున్న రూ. 25 ద్వారా వచ్చే ఆదాయాన్ని క్షురకులకు ఇస్తున్నారు. అయితే, ఈ మొత్తం సరిపోవడం లేదని, ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమకు రెగ్యులర్ ఉద్యోగుల్లానే కనీస వేతనం ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పెంచిన టికెట్ ధర రూ. 40 ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని క్షురకులకే ఇస్తారు.

ఏపీ ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరను భారీగాపెంచిన ప్రభుత్వం!

అంటే తలనీలాల టికెట్లపై వచ్చే ఆదాయాన్ని ఆలయంలోని క్షురకులందరికీ సమానంగా పంచుతారు. అలా పంచినప్పుడు ఒకవేళ వారి కమిషన్ రూ. 20 వేల కంటే తక్కువగా వస్తే అప్పుడు తలనీలాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అవి కూడా సరిపోని పక్షంలో ఆలయ ఆదాయంలో మూడు శాతం కమిషన్‌ను వినియోగించుకోవచ్చు. కాగా, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కేశఖండన విధులు నిర్వర్తించే క్షురకులు 1,100 మంది ఉంటారని తెలుస్తోంది. అప్పటికీ సరిపోకుంటే మిగిలిన మొత్తం కోసం ఆలయ అధికారులు కమిషనర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది జనవరి నుంచి పనిచేస్తున్న క్షరుకులకే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఆలయాల్లోని క్షురకులకు ఏడాదిలో కనీసం 100 రోజుల పని ఉంటేనే ఇది వర్తిస్తుందని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news